పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్ని లారీ.. 20 మందికి గాయాలు

 పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్ని లారీ.. 20 మందికి గాయాలు
  • నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద ప్రమాదం
  • హైవే పక్కన ఆపిన వాహనాన్ని ఢీకొన్న మినీ లారీ

నెల్లూరు: పెళ్లి బృందం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది మినీ లారీ. ఈ ప్రమాదంలో డ్రైవర్ తోపాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు చేతులు పూర్తిగా విరిగి వాహనంలోనే చిక్కుకోగా స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. 
కడప జిల్లా గోపవరం మండలం పీపీ గుంట నుంచి పెళ్లి బృందం వారు మినీ లారీలో నెల్లూరు జిల్లా కదలకూరు మండలం గిద్దలూరుకు బయలుదేరారు. మార్గం మధ్యలో ఉప్పలపాడు వద్ద హైవేపై రోడ్డుకు పక్కన వీరి వాహనం కొద్దిసేపు ఆపారు. ఇంతలో ఓ  లారీ డ్రైవర్ అదుపుతప్పి వెనుక నుంచి వచ్చి ఆగి ఉన్న పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 16 మంది గాయపడగా చికిత్స కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.