బొలెరో బోల్తా.. 20 మందికి గాయాలు.. వనపర్తి జిల్లా పాన్‌‌‌‌ గల్‌‌‌‌ సమీపంలో ప్రమాదం

బొలెరో బోల్తా.. 20 మందికి గాయాలు.. వనపర్తి జిల్లా పాన్‌‌‌‌ గల్‌‌‌‌ సమీపంలో ప్రమాదం

పానుగల్, వెలుగు : బోలెరో బోల్తాపడి 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పాన్‌‌‌‌గల్‌‌‌‌ మండలంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాన్‌‌‌‌గల్‌‌‌‌ మండలం చింతకుంట గ్రామానికి చెందిన పలువురు శనివారం యాదగిరిగి గుట్టలో బంధువుల వివాహం ఉండడంతో... బొలెరో వాహనంలో వెళ్లారు. వివాహం తర్వాత తిరుగు పయనమయ్యారు. పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలపురంలో కొందరిని దింపి, రాత్రి అక్కడే బస చేశారు. 

ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు చింతకుంటకు బయలుదేరగా పాన్‌‌‌‌గల్‌‌‌‌ మండలం తెల్లరాళ్లపల్లి వంతెన సమీపంలోకి రాగానే బొలెరో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో ఐదుగురు చిన్నారులతో పాటు 15 మంది పెద్దలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పాన్‌‌‌‌గల్, వీపనగండ్ల 108 సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారిని జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. రెండేండ్ల సాత్వికకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ప్రభుత్వ జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.