ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన కాక్ రోచ్ పార్టీ...సీజేపీ స్పీడ్ మాములుగా లేదు..!

ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన కాక్ రోచ్ పార్టీ...సీజేపీ స్పీడ్ మాములుగా లేదు..!

కాక్ రోచ్ పార్టీ.. ఇండియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇదే. ఆన్ లైన్ లో పుట్టిన పార్టీ స్థాపించిన నాలుగు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో బీజేపీ లాంటి పెద్ద పార్టీని బీట్ చేసి సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని బీట్ చేసిన సీజేపీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించింది. నాలుగు రోజుల్లోనే 10 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించి బీజేపీని బీట్ చేసిన సీజేపీ ఆరు రోజుల్లోనే 20 మిలియన్ మార్క్ చేరుకుంది.

'కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)' మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ ఆరు రోజుల్లోనే రెండు కోట్ల మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవడం మొదలుపెట్టారు. 

గంటగంటకూ ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెనీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. 

ఈ క్రమంలో సీజేపీ ఆధారంగా యువత.. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడది ప్రశ్నించే స్థాయి నుంచి.. ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలా మంది మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీని ఫాలో అవుతున్నారు.