జనగామ అర్బన్, వెలుగు : బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల స్కీం ద్వారా లక్కీ డ్రా తీయగా20 మంది విద్యార్థులు ఎంపికైనట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్పరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లాటరీ తీశారు.
84 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 20 మంది విద్యార్థులకు జిల్లాలోని మూడు ప్రైవేట్ స్కూళ్లలో సీట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ప్రేమకళ, సిబ్బంది పాల్గొన్నారు.