నూనెతో రోగాలు నయం?… తొక్కిసలాటలో 20 మంది మృతి

నూనెతో రోగాలు నయం?… తొక్కిసలాటలో 20 మంది మృతి

నూనెతో రోగాలు తగ్గిస్తానన్నడు

నూనె చల్లుతుంటే తొక్కిసలాట

20 మంది మృతి  టాంజానియా చర్చిలో ఘటన

పరారీలో మతబోధకుడు

టాంజానియాలో చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోయారు. మరో 16 మంది గాయపడ్డారు. మోషి టౌన్ లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ చర్చిలో ప్రముఖ మత బోధకుడు బోనిఫేస్ వాంపోసా నిర్వహించిన ప్రేయర్ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని  అధికారులు చెప్పారు. తాను దేవుడి దూతనని, రోగాలను నయం చేసే పవిత్రమైన నూనె తన దగ్గర ఉందని వాంపోసా ప్రకటించారు. అక్కడ ఉన్నవారిపై దాన్ని చల్లడంతో పవిత్రమైన నూనె తమపై పడాలని అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. మోషిలో 20 మంది చనిపోయిన ఘటనపై టాంజానియా ప్రెసిడెంట్ మగుఫులి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యుడైన మతబోధకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.