మంచిర్యాల జిల్లాలో తమ్ముడి ప్రేమ వివాహం అక్కకు ప్రాణ సంకటంలా మారింది. ప్రియురాలితో పారిపోయి యువకుడు పెళ్లి చేసుకున్న ఘటనలో.. యువకుడి అక్కను విచక్షణరహితంగా కొట్టారు అమ్మాయి కుటుంబ సభ్యులు. దీంతో బుధవారం (2026, మార్చి 25) కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వ వెళ్తే.. రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల సదా (22) అనే యువతిపై అమ్మాయి ఫ్యామిలీ దాడి చేశారు. బాధిత మహిళ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తుంది. మహిళ తమ్ముడు అక్షయ్ బుధవారం ఉదయం ఎదురింట్లో ఉండే అమ్మాయి అక్షితతో పరారై పెళ్లి చేసుకున్నాడు.
►ALSO READ | అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. కుటుంబాలకు రూ.15 లక్షల చెక్కుల పంపిణీ
యువకుని సోదరి సదా పై విచక్షణరహితంగా దాడి చేశారు యువతి బంధువులు. తీవ్ర అస్వస్థతకు గురైన యువతిని స్థానికులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . స్థానికుల సమాచారంతో దేవాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
