అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే యుద్ధం ముగుస్తుందంటూ ప్రకటన

అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే యుద్ధం ముగుస్తుందంటూ ప్రకటన

యుద్ధం ముగింపుకు సంబంధించి అమెరికా సూచించిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. మా షరతులు నెరవేరితేనే యుద్ధం ముగుస్తుంది. కానీ అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు కాదు. ట్రంప్ నిర్దేశిస్తే మేము అంగీకరించం.. మా కండిషన్స్ కు ఓకే అంటేనే వార్ కు ఎండ్ కార్డు పడుతుంది.. అంటూ ఇరాన్ స్పష్టం చేసింది. 

అమెరికా ఇచ్చిన 15 పాయింట్ల సీజ్‌ఫైర్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అమెరికా ప్రతిపాదనలో ఇరాన్‌పై సాంక్షన్లు ఎత్తివేయడం, మిస్సైల్స్ కార్యక్రమాలపై పరిమితులు, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలో అణు కార్యకలాపాలను ఆపేయటం వంటివి ఉన్నాయి.

ఇరాన్  5 షరతులు:

  • శత్రువుల దురాక్రమణ, హత్యలను పూర్తిగా నిలిపివేయాలి.
  • హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించాలి.
  • యుద్ధం వల్ల కలిగిన నష్టాలకు బాధ్యత ఎవరిదో నిర్ణయించి, పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి.
  • భవిష్యత్తులో ఇలాంటి యుద్ధం మళ్లీ జరగకుండా హామీలు ఇవ్వాలి.
  • ఇస్లామిక్ రిపబ్లిక్‌పై మరోసారి దాడి చేయకుండా చూసేందుకు పటిష్టమైన విధివిధానాలను రూపొందించాలి

హార్మూజ్ జలసంధి తన సహజ, చట్టపరమైన హక్కుగా పేర్కొంది. తమ షరతులన్నీ నెరవేరే వరకు తమవైపు నుంచి యుద్ధం కనసాగుతూనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం ముగింపుపై తన వైఖరిని చెప్పిన ఇరాన్.. ప్రస్తుత అమెరికా ప్రతిపాదన మితిమీరిందని పేర్కొంది. ఇరాన్ తను ఎప్పుడు ముగించాలంటే అప్పుడే యుద్ధాన్ని ముగిస్తుందని.. అమెరికా షరతులపై కాదని ఇరాన్ అధికారిక మీడియా స్పష్టం చేసింది.