
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఐదో రోజైన శుక్రవారం 20 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇబ్రాహీంఖాన్, సయ్యద్ ముస్తాఫా హుస్సేన్ మరో సెట్ నామినేషన్ వేశారు.
మిగిలిన18 మందిలో 13 మంది వివిధ పార్టీల తరఫున, 5 మంది ఇండిపెండెంట్గా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. ఇప్పటివరకు మొత్తం 63 మంది నుంచి 79 సెట్ల నామినేషన్లు వచ్చాయి. కాగా, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి పేరిట ఆయన భార్య హరిత రెడ్డి నామినేషన్ వేసేందుకు 3:05 గంటలకు రాగా, నామినేషన్లకు 3 గంటల వరకే అవకాశం ఉండడంతో అనుమతించలేదు. కాగా, ఈ నెల 21 వరకు నామినేషన్లకు అవకాశముంది.