ఆస్తి పన్నుఅడ్వాన్స్ గా చెల్లిస్తే 20 శాతం రిబేటు

ఆస్తి పన్నుఅడ్వాన్స్ గా చెల్లిస్తే 20 శాతం రిబేటు

వికారాబాద్ వెలుగు: 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నను ముందుగా చెల్లించే వారికి 20% రిబేటు ఇవ్వనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయెషా మస్రత్ ఖానమ్ తెలిపారు. కలెక్టర్ చాంబర్ లో ఇంటి పన్ను వసూలుపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2018–19ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 88%, తాండూరు పరిధిలో 98 శాతం, పంచాయతీల పరిధిలో 63 శాతం ఆస్తిపన్ను వసూలు చేసినట్లు తెలిపారు. అవసరమైతే మరికొన్ని స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేయాలని కలెక్టర్ అన్నారు. చెత్తను విడివిడిగా ఇచ్చేవారికే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. డీపీఓ రిజ్వాన, మున్సి పల్ కమిషనర్ భోగేశ్వర్ తదితరులు పాల్గొ న్నారు.

నర్సరీలకు అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ నీరు

హరితహారం ద్వారా నిర్వహిస్తున్న నర్సరీలకు ఇక నుంచి అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ నీటిని సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్‍ తెలిపారు. వికారాబాద్‍ మున్సి పల్‍ పరిధిలోని అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ సిస్టమ్‍ పనితీరును సోమవారం కలెక్టర్‍ పరిశీలించారు. ఇక నుంచి హరితహారం నర్సరీలకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మున్సి పల్ కమిషనర్‍ భోగేశ్వర్‍,సిబ్బంది ఉన్నారు.

వెంటనే చెల్లించాలి..

ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిం చిన ఆస్తి పన్నును వెంటనే చెల్లించాలని కలెక్టర్ అధికారులకు సూచిం చారు. సోమవారం కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమన్వయసమావేశం నిర్వహిం చారు. వర్షాలకు జిల్లాలోని మామిడి పంట 90 శాతం దెబ్బతిందని, నష్టపోయిన రైతులను గుర్తిం చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో జా న్సన్ తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.