రూల్స్ బ్రేక్..20 వేల బండ్లు సీజ్

రూల్స్ బ్రేక్..20 వేల బండ్లు సీజ్

హైదరాబాద్, వెలుగు: కరోనా నివారణ కోసం ప్రభుత్వం అమలులోకి తెచ్చిన లాక్​డౌన్​, ఎపిడమిక్​డిసిజెస్ యాక్టు విషయంలో పోలీసు శాఖ పక్కాగా వ్యవహరిస్తోంది. జనం బయట తిరగకుండా ఉండేం దుకు ఎక్కడిక్కడ చెక్​పోస్టులు పెట్టి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. ఆ వాహనాలపై ఎపిడమిక్​డిసిజెస్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీపీలోని 188 సెక్షన్​కింద పెడుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం…. ప్రజల జీవితాలకు, ఆరోగ్యానికి, భద్రతకు భంగం కలిగించినప్పడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 80 వేల వెహికల్స్​పై మోటార్​ వెహికల్ యాక్ట్ (ఎంవీ యాక్ట్)​ ప్రకారం కేసులు పెట్టారు. వీటిలో 20 వేల వెహికల్స్​ను ఎపిడమిక్​డిసిజెస్ యాక్టు కింద సీజ్​చేశారు. ఎంవీ యాక్ట్ కింద కేసులు పెట్టిన బండ్లకు చలానాలు విధించనున్నారు. సీజ్​ చేసినవి ఎపిడమిక్​డిసిజెస్ యాక్టును ఎత్తివేసిన తర్వాత అప్పగిస్తారు.

రాజధానిలోనే ఎక్కువ…

ఎక్కువ కేసులు హైదరాబాద్​సిటీలోనే నమోదవుతున్నాయి. సైబరాబాద్​ కమిషనరేట్​లోనే రోజూ 15 వేల నుంచి 20 వేల వెహికల్స్ పై కేసులు రికార్డవుతున్నాయి. ఈ నెల 23 నుంచి అమలులోకి రాగా పోలీసులు మొదటి రోజు హెచ్చరించి వదిలేశారు. ఆ తరువాత రోజు నుంచి  కమిషరేట్ల పరిధి కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నెల 24న  ఒక్క సైబరాబాద్​ కమిషనరేట్​లోనే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటి వరకు ఈ కమిషనరేట్​ పరిధిలో లక్ష బండ్లపై కేసులు పెట్టారు.  మిగతా కమిషనరేట్లలో  80 వేల వరకు కేసులు నమోదయ్యాయి. మొత్తం లక్షా 80 వేల బండ్లలో 20 వేల బండ్లను సీజ్​ చేశారు. దీంతో బయటికి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది.

మూడు కిలోమీటర్ల పరిధి..

ఈ యాక్టు అమలులోకి వచ్చిన వెంటనే రూరల్​ఏరియాల్లో గ్రామం యూనిట్​గా పెట్టి అక్కడి నుంచి ఎవరూ బయటికి రావద్దని పోలీసు శాఖ స్పష్టం చేసింది. అర్బన్​ఏరియాల్లో ప్రతి మూడు కిలో మీటర్ల పరిధిని ఒక యూనిట్​గా నిర్ణయించింది. అ పరిధిలోనే కూరగాయలు, మందులు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఈ రూల్​గట్టిగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ చెక్​పోస్టులు పెట్టింది. మూడు కిలో మీటర్ల పరిధి లోపల కూడా అనవసరంగా బయట తిరిగే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

డాక్టర్లు, నర్సులు కావలెను