
క్రికెట్ లో ప్రతి జనరేషన్ లో కొంతమంది ప్లేయర్లు తమదైన మార్క్ వేస్తారు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడుతూ అలవోకగా పరుగులు రాబడతారు. ఈ తరంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్,జో రూట్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ప్రస్తుత క్రికెట్ లో ఫ్యాబ్-4 గా పరిగణిస్తారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్ లో తగ్గేదే లేదన్నట్టు అదరగొట్టారు. అయితే, ప్రస్తుతం వీరు క్రికెట్ లో పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. ఫామ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా.. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడం లేదు.
ఫ్యాబ్-4 గా పరిగణించే ఈ నలుగురు మూడు ఫార్మాట్ లు ఆడడం లేదు. కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ 20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. స్టీవ్ స్మిత్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. రూట్, విలియంసన్ రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతుంది. దీంతో ఇప్పుడు భవిష్యత్ లో ఫ్యాబ్ 4 అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ దశాబ్దంలో బెస్ట్ ప్లేయర్ ఎవరనే విషయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ను ప్రస్తుత క్రికెట్ లో టాప్ బ్యాటర్ గా అభివర్ణించాడు.
ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.." బిగ్ బాష్ లీగ్ డ్రాఫ్ట్ లో పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజామ్ కంటే పెద్ద పేరు మరొకటి లేదు. పాకిస్థాన్ క్రికెట్ లో బాబర్ కు మించిన ప్లేయర్ లేడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో బాబర్ బెస్ట్ ప్లేయర్. అంతేకాదు ఈ దశాబ్దంలోనే బాబర్ గ్రేటెస్ట్". అని ఫించ్ చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా బాబర్ బ్యాటింగ్ చేయడంలో తడబడుతున్నాడు. మూడు ఫార్మాట్ లో పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ బాబర్ పేరు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
►ALSO READ | IND vs ENG: ఇంగ్లాండ్ బుమ్రాకు భయపడదు.. అతనొక్కడు ఏం చేయలేడు: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
ఇదిలా ఉంటే ఇటీవలే బాబర్ అజామ్ ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ బాబర్ అజామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శుక్రవారం (జూన్ 13) అధికారికంగా ప్రకటించింది. రాబోయే బిగ్ బాష్ లీగ్ 2026 సీజన్ కోసం బాబర్ సిడ్నీ సిక్సర్స్ తరపున ప్రీ-డ్రాఫ్ట్ ఒప్పందం చేసుకున్నాడు. బాబర్ అజామ్ కు ఇదే తొలి బిగ్ బాష్ లీగ్ కావడం విశేషం. పాకిస్థాన్ జట్టు తరపున టీ20 ఫార్మాట్ లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ నెలకొల్పిన బాబర్ సిడ్నీ సిక్సర్స్ లో చేరడం తమకు కలిసి వస్తుందని ఆ జట్టు ఫ్రాంచైజీ తెలిపాడు.
Aaron Finch "There's none bigger than Babar Azam. He's one of the best players in the world we've seen over the past decade. Great for the Australian public and fans to see such a superstar in the competition."🇵🇰pic.twitter.com/hLYY2Sg1Bs
— junaiz (@dhillow_) June 17, 2025