జూన్ 24 నుంచి పాలిసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్.. రెండు విడతల్లో ప్రవేశాలు..

జూన్ 24 నుంచి పాలిసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్.. రెండు విడతల్లో  ప్రవేశాలు..

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు పాలిసెట్–20245 అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. రెండు విడతల్లోనే ప్రవేశాలు కల్పించనున్నట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం (జూన్ 19) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. 

ఈ నెల 24 నుంచి 28 వరకు రిజిస్ర్టేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది. జూన్ 26 నుంచి 29 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఈ నెల 26 నుంచి జులై1  దాకా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 

డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇతర వివరాలకు https://tgpolycet.nic.in వెబ్​సైట్​ను సందర్శించాలని అధికారులు సూచించారు.