KUBERAA X Review: ధనుష్, నాగార్జున ‘కుబేర’ X రివ్యూ.. మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

KUBERAA X Review: ధనుష్, నాగార్జున ‘కుబేర’ X రివ్యూ.. మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ ‘కుబేర’ (KUBERAA). రష్మిక హీరోయిన్‌‌. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషించాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు.

నేడు శుక్రవారం (జూన్ 20న) ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదలైంది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారు. నాగార్జున రిచ్ పర్సన్ క్యారెక్టర్లో కనిపించారు.

అసలేమీ ఆశించని బిచ్చగాడు, అన్నీ కావాలనుకునే ధనికుడికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే ఈ కుబేర కథ ఎలా ఉంది? సోషల్ మీడియాలో సినిమాకు ఎలాంటి టాక్ వస్తోంది? అనే పూర్తి వివరాలు X రివ్యూలో చూసేద్దాం. 

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ చాలా బాగుందని ఆడియన్స్ అంటున్నారు. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే బిచ్చగాడి పాత్రలో ధనుష్ ఆకట్టుకున్నాడని, ఓ బిచ్చగాడు ప్రభుత్వాన్ని ఏవిధంగా ప్రమాదంలో పడేసేలా చేశాడనేది ప్రధానంగా చూపించారని ప్రేక్షకులు పోస్టులు పెడుతున్నారు.

ధనిక, మధ్య తరగతి, పేద అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో జరిగే కథ ఇది. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఈ దేశంలో నీతి, న్యాయం కాదు డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే నాగార్జున పవర్ ఫుల్ రిచ్ పర్సన్ గా కనిపిస్తున్నాడు. రష్మిక మందన్నా క్యారెక్టర్ సినిమాకు మరో ప్రధాన బలమని,  ధనవంతులు, శక్తిమంతులే ఎప్పుడూ ప్రపంచాన్ని ఏలుతారని నమ్మే పాత్రలో నటించి మెప్పించిందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓవరాల్గా వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే శేఖర్ కమ్ముల.. ఫస్ట్ టైం ఓ థ్రిల్లింగ్ పాయింట్‌‌‌‌‌‌‌‌తో కుబేర తెరకెక్కించాడని సినీ ఫ్యాన్స్ నుంచి టాక్ వస్తోంది.

 ఓ నెటిజన్ తన రివ్యూ పంచుకుంటూ.. కుబేర ఫస్ట్ హాఫ్ ర్యాంప్ చాలా బాగుంది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ జాతీయ అవార్డు నటనని కనబరిచాడు. నాగార్జున అక్కినేని తన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన BGMతో సినిమాని పతాకస్థాయికి తీసుకెళ్లాడు. సెకండాఫ్ లో కనీసం ఓ 4-5 ఎమోషన్ సీన్స్ లో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడని' ట్వీట్ చేశాడు.

మరో నెటిజన్ రివ్యూ పంచుకుంటూ.. "దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణాన్ని కుబేరతో అందించాడు. చివరి 10 నిమిషాలు తప్ప, కుబేర సెకండాఫ్ అద్భుతంగా ఉంది. కానీ, క్లైమాక్స్‌ను ఎలా రిసీవ్ చేసుకోవాలో మాత్రం తెలియడం లేదు. ముగింపు తప్పిపోయిందా? లేదా తప్పుగా మారిందా? అనేది తెలియడం లేదు. అయినప్పటికీ, కుబేర క్లైమాక్స్ ఒక్కటే, సినిమాపై మొత్తం ప్రభావాన్ని తగ్గించదు. దానికి ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్, థ్రిల్లర్ సీన్స్ మీతోనే ఉంటాయి. ధనుష్ అందించిన నటన చాలా కాలం పాటు మీతో ఉంటుంది.నాగార్జున, రష్మిక అద్భుతంగా నటించారు. నాకు 2025లో అత్యుత్తమ తెలుగు చిత్రం ఇదే!" అని ఓ నెటిజన్ సినిమాపై తన అబిప్రాయం వ్యక్తం చేశాడు.

మరో సినీ అభిమాని తన రివ్యూను రాస్తూ.. "కుబేర మూవీ చూడదగ్గ క్రైమ్ డ్రామా. ఫస్టాఫ్, సెకండాఫ్ లో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. కానీ అదే సమయంలో, అసమాన వేగంతో మరియు వేగంగా ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సీక్వెన్స్‌తో సినిమా వెళుతుంది. ఈ సినిమాతో ధనుష్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచాడు. తన గెటప్ తో, తన నటనతో ఆకట్టుకున్నాడు.

శేఖర్ కమ్ముల, ఎప్పటిలాగే, మొదటినుండి కథకు కట్టుబడి ఉన్నాడు. ఈ సినిమా ప్రయాణంలో అతని దర్శకత్వ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, అస్థిరమైన ఎడిటింగ్, లెన్తీ రన్‌టైమ్ మరియు సడెన్ గా వచ్చే ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్, కుబేర పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటాయి. క్రిస్పీ స్క్రీన్‌ప్లే మరింత ప్రభావవంతంగా ఉంది.

నాగార్జున లాంటి స్టార్ హీరోకి మరో ప్రత్యేకమైన పాత్రతో న్యాయం చేశాడు డైరెక్టర్. రష్మిక తన పాత్రతో మెప్పిస్తుంది. DSP అద్భుతుమైన సంగీతం ఇచ్చాడు. సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో DSP మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని" ఓ నెటిజన్ రివ్యూ పంచుకున్నాడు.