
జుట్టుకు రంగు వేసుకోవడం సాధారణం ఈరోజుల్లో.. వయస్సు పెరిగే కొద్దీ తెల్ల జుట్టు కనిపించకుండా ఉండేందుకు ఇలా హెయిర్ డై వేసుకుంటుంటారు. కానీ హెయిర్ డై వాడకం మితిమీరితే ఎంత ప్రమాదకరమో మీరు అస్సలు ఉహించి ఉండరు. ప్రతినెల జుట్టుకు రంగు వేసుకోవడంతో ఓ 20 ఏళ్ల చైనా యువతి కిడ్నీ (మూత్రపిండాల) వ్యాధితో ఆస్పత్రిలో చేరింది.
సమాచారం ప్రకారం 'హువా' అనే యువతి తన జుట్టుకి ఆమె ఎంతో ఇష్టపడే ఒక సెలబ్రిటీ హెయిర్ కలర్ల ఉండేలా అచ్చం అదే కలర్ వేయించుకునేది. ఆ సెలబ్రిటీ జుట్టు రంగు మార్చుకున్నప్పుడల్లా, ఆ యువతి కూడా సెలూన్‌కి వెళ్లి అదే రంగు వేయించుకునేది. కొంతకాలానికి ఆమె కాళ్లపై ఎర్రటి మచ్చలు, తీవ్రమైన కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దింతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు కిడ్నీ వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు తేల్చి చెప్పారు.
ఆమెకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఆమెకు కిడ్నీలలో వాపు ఉందని, ప్రతి నెలా జుట్టుకు రంగు వేయడం వల్ల హెయిర్ డైలోని ప్రమాదకరమైన విష రసాయనాలు ఆమె శరీరంలోకి చేరి కిడ్నీలు సరిగా పనిచేయకుండా చేశాయని డాక్టర్ చెప్పారు. అంతేకాదు నెలకు ఒకసారి తన జుట్టుకు రంగు వేసుకుంటానని ఆ మహిళ స్వయంగా చెప్పిందని కూడా అన్నారు.
డాక్టర్ ప్రకారం హెయిర్ డైలలో ఉండే విషపదార్థాలు కిడ్నీలు పాడైపోవడానికి, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి. అంతేకాక, వీటిలో ఉండేటివి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయన్నారు. సెలబ్రిటీలలాగే జుట్టు కలర్ మార్చుకోవడానికి గుడ్డిగా ఫాలో అయితే ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అలాగే పాప్ స్టార్స్ ఎప్పటికప్పుడు హెయిర్ కలర్స్ మార్చడం గురించి కూడా చర్చ మొదలైంది.
అంతేకాదు నెటిజన్లు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఏ స్టార్‌ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని ఒకరు.. మరొకరు ఆమె కేవలం కలర్ వేయించుకోవడమే కాకుండా, కలర్ తీసేయడానికి బ్లీచింగ్ కూడా చేసి ఉండవచ్చు అని అన్నారు. ఇంకొందరు సెలబ్రిటీల ట్రెండ్ గుడ్డిగా ఫాలో అయితే కలిగే నష్టాల గురించి కామెంట్స్ చేసారు.