కోచిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

కోచిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

కోచి: ఇరాన్​కు చెందిన ఫిషింగ్ బోట్​ నుంచి 200 కిలోల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు నార్కోటిక్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) డిప్యూటీ డైరెక్టర్​ జనరల్​ సంజయ్​ కుమార్​ సింగ్​ తెలిపారు. డ్రగ్స్​ విలువ సుమారు రూ.1,200 కోట్లు ఉంటుందని, నేవీ అధికారులతో కలిసి జాయింట్​ ఆపరేషన్​ చేపట్టినట్టు మీడియాతో చెప్పారు. డ్రగ్స్​ను నీళ్లలో పడేసి.. ఇరాన్ ​వాసులు పారిపోయేందుకు ప్రయత్నించారు. తర్వాత డ్రగ్స్​తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకుని మట్టంచెర్రీ వార్ఫ్​కు తరలించారు.

ఎన్​డీపీఎస్​ యాక్ట్​– 1985 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 200 ప్యాకెట్లపైన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్​ ప్యాకింగ్​ మార్క్​లు ఉన్నాయి. కొన్ని డ్రగ్స్​ ప్యాకెట్లపై ‘స్కార్పియన్’ సీల్​ ఉండగా.. మరికొన్నింటిపై ‘డ్రాగన్’ సీల్ గుర్తులను ఎన్​సీబీ అధికారులు గుర్తించారు. ఏడు వాటర్​ ప్రూఫ్ లేయర్స్​లో డ్రగ్స్​ ప్యాక్​ చేశారు. అఫ్గాన్​ నుంచి తీసుకొచ్చి.. పాకిస్తాన్​కు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీలంక బోటులోకి డ్రగ్స్​ ఎక్కించేందుకు భారత​ జలాల్లోకి ప్రవేశించినప్పుడే ఎన్​సీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీలంక నౌకను పట్టుకునేందుకు ప్రయత్నించినా..ఫలితం లేకుండా పోయింది.అరేబియా, హిందూ మహా సముద్రం ద్వారా ఇండియాలోకి అఫ్గాన్​ హెరాయిన్​ వస్తోందన్నారు.