తెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు

తెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం.. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ సర్కార్. మార్చి 1వ తేదీ శుక్రవారం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఈరోజు నుంచే విద్యుత్ వినియోగదారులకు జీవో బిల్లులు జారీ కానున్నాయి. ప్రజా పాలన దరఖాస్తులలో అప్లై చేసుకున్న వారికి ఉచిత్ విద్యుత్ అందించనుంది ప్రభుత్వం. విద్యుత్ సిబ్బంది మీటర్ చెక్ చేసి 200 లోపు యూనిట్లు ఉన్న వారికి జీరో బిల్లు జనరేట్ చేసి బిల్లు ఇవ్వనున్నారు.  వైట్ రేషన్ కార్డు ఉన్నవారిని స్కీంకు అర్హులుగా చెప్పింది సర్కార్. 
 
ఇటీవల సచివాలయంలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..గృహజ్యోతి పథకంతోపాటు రూ.500లకే ఇంటి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 48 గంటల్లోనే మొదటగా రెండు గ్యారంటీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.