అది వన్డే వరల్డ్ కప్..ఇది టీ20 వరల్డ్ కప్..మిగతాది అంత సేమ్ టూ సేమ్..

అది వన్డే వరల్డ్ కప్..ఇది టీ20 వరల్డ్ కప్..మిగతాది అంత సేమ్ టూ సేమ్..

టీ20 వరల్డ్ కప్ 2022లో ..2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుద్దా ?...టీమిండియానే విజేతగా అవతరించనుందా..? అంటే దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తుంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ 2022లో జరుగుతున్న పరిణామాలు, సంఘటనలు, ట్విస్టులు చూస్తుంటే..అభిమానులకు 2011 వరల్డ్ కప్పే గుర్తు వస్తుంది. 

దగ్గరి పోలికలు..కారణాలు..

  • 1. 2011 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీమ్...ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ వరల్డ్ కప్లోనూ ఐర్లాండ్ ఇంగ్లాండ్పై గెలిచింది. 
  • 2. 2011 వరల్డ్ కప్లో టీమిండియా సౌతాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో 2 బంతులు మిగిలి ఉండగా సౌతాఫ్రికా గెలిస్తే... 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సరిగ్గా 2 బంతులు మిగిలి ఉండగానే టీమిండియాపై విజయం సాధించడం గమనార్హం. 
  •  

  • 3. 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ సౌతాఫ్రికా సెమీస్  చేరలేదు.  క్వార్టర్ ఫైనల్లో  న్యూజిలాండ్‌ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఆ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కూడా సెమీస్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. ప్రస్తుతం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. టీ20 వరల్డ్ కప్ 2022లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా సెమీస్ చేరలేదు. 
  • 4. 2011 ప్రపంచకప్  సెమీస్ లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా న్యూజిలాండ్, ఇండియా, పాక్ జట్లు సెమీస్ బెర్తును దక్కించుకున్నాయి. 

సీన్ రిపీట్ అవుద్దా...?


2011 వన్డే వరల్డ్ కప్కు..టీ20 వరల్డ్ కప్ 2022కు దగ్గరి పోలికలు ఉండటంతో...టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి భారత్ విశ్వవిజేతగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అది 2011 వన్డే వరల్డ్ కప్ కాగా..ఇది టీ20 వరల్డ్ కప్ అని..ఫార్మాట్ మాత్రమే తేడా అని అంటున్నారు. టీమిండియా కప్తోనే భారత్ తిరిగి వస్తుందని చెబుతున్నారు.