టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువ

టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువ
  • గవర్నర్ తమిళ సై సౌందర రాజన్

హైదరాబాద్: టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వచ్చే 2022 సంవత్సరం ఆరోగ్య సంవత్సరంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు.  నగరంలోని చింతల్ బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇవాళ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సందర్శించారు. 100శాతం తొలిడోస్ వాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. 
ఈ సందర్భంగా గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ మాట్లాడుతూ 100% మొదటి డోస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సరైన సమయానికే 2 వ డోస్ తీసుకోవాలని ప్రజలని కోరారు. కేవలం ఒకే డోస్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందిస్తూ అన్ని డోస్ లు అందజేసిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.  ఆఫ్రికాలో హెల్త్ వర్కర్ లు సైతం కేవలం 4% మందే టీకా తీసుకున్నారని, మన వద్ద ఆశా  వర్కర్ లు ఇంటింటికి వెళ్లి టీకాలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాబోయే కొత్త సంవత్సరం ఆరోగ్య సంవత్సరంగా సాగాలని కోరుకుంటున్నానన్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

బంగారు గని కూలి 38 మంది మృతి

అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు

మరో 10 లక్షల టన్నుల వడ్ల సేకరణకు లైన్‌‌ క్లియర్‌‌