
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం కూడా థియేటర్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేవి చూద్దాం.
సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు. దీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ నటుడు SJ సూర్య కీ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ తెరపై రాని ఓ భిన్నమైన కథాంశంతో దీన్నిరూపొందించారు. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథ ఇది.
అహో విక్రమార్క
పలు చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్న దేవ్ గిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహో విక్రమార్క’. త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రా శుక్లా హీరోయిన్. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన భార్య ఆర్తి నిర్మిస్తున్నారు.ఈ మూవీ ఆగస్టు 30న రిలీజ్ కానుంది. దేవ్‌గిల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది చిత్ర కథ.
మాస్ రీ రిలీజ్
అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగష్టు 29 సందర్భంగా..అక్కినేని ఫ్యాన్స్ కోరిక మేరకు నాగార్జున మాస్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. లారెన్స్ దర్శకత్వంలో జ్యోతిక హీరోయిన్‌గా..నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ సినిమాను కింగ్ బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 28,29 తేదీల్లో 4కెలో ‘మాస్’ను ప్రదర్శిస్తున్నారు.