ఐసీసీ మెగా ఈవెంట్ల వేదికలు ఖరారు

ఐసీసీ మెగా ఈవెంట్ల వేదికలు ఖరారు

2025 ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ భారత్లో జరగనుంది. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. ఉమెన్స్ వరల్డ్ కప్ ఈవెంట్కు భారత్ చివరి సారిగా 2013లో ఆతిధ్య ఇచ్చింది. దశాబ్దం తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్ను భారత్ నిర్వహించబోతుంది.  ఇప్పటి వరకు భారత్ నాలుగు సార్లు ఆతిధ్య ఇవ్వగా..ఇది ఐదోసారి కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు  పాల్గొంటాయి. ఈ జట్లు 31 మ్యాచ్‌లు ఆడతాయని  ఐసీసీ  ప్రకటించింది. అటు 2024లో జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ వేదిక కానుంది.  దీంతో 2024 నుంచి 2027 వరకు మహిళలకు సంబంధించి నాలుగు ఐసీసీ టోర్నీలు జరగనున్నాయి.

ఫస్ట్ టైం టీ20 ఫార్మాట్లో ..
 2026 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో జరగనుందని ఐసీసీ వెల్లడించింది. ఈ టోర్నీలో 12  జట్లు పాల్గొంటాయి. మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక 2027 ఉమెన్స్  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక వేదిక కానుంది. ఫస్ట్ టైం  ఛాంపియన్స్ ట్రోఫీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.  2026  ఫిబ్రవరి లో జరగనున్న ఈ టోర్నీలో ఆరు జట్లు.. 16 మ్యాచ్‌లు ఆడతాయి. 

మరోసారి లార్ట్స్లో ..
2023, 2025లో జరిగే టెస్టు ఛాంపియన్ షిప్  ఫైనల్ ఇంగ్లాండ్ లోని లార్ట్స్ లో జరగనుంది. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. గతంలో 2021లోనూ ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్  లార్ట్స్లోనే జరిగింది. ఈ ఫైనల్ సౌతాంప్టన్లో జరగాల్సి ఉన్నా..కరోనా కారణంగా లార్ట్స్కు తరలించారు. ఇప్పుడు మరో రెండు సార్లు జరిగే ఫైనల్ మ్యాచులకు కూడా లార్డ్స్నే వేదికగా నిర్ణయించారు.