2,509 టీచర్‌‌‌‌ పోస్టులకు 2,058 మందే..

2,509 టీచర్‌‌‌‌ పోస్టులకు 2,058 మందే..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:వివాదాలు లేని టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఖాళీలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఇప్పటికే స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌, లాంగ్వేజీ పండిట్స్‌‌‌‌, పీఈటీ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌‌‌‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పది జిల్లాల పరిధిలో ఈ విభాగాల్లో విద్యా శాఖ మొత్తం 2,509 పోస్టులను నోటిఫై చేయగా.. 2,058 మంది అభ్యర్థులనే టీఎస్‌‌‌‌పీఎస్సీ ఎంపిక చేసింది. మరో 451 పోస్టులకు సరైన అభ్యర్థులు దొరకలేదని అధికారులు చెప్తున్నారు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో ఎక్కువగా 442 పోస్టులను విద్యా శాఖ గుర్తించగా, 374 మంది అభ్యర్థులను టీఎస్‌‌‌‌పీఎస్సీ ఎంపిక చేసింది. తక్కువ పోస్టులున్న ఖమ్మం జిల్లాలో 128 పోస్టులను గుర్తిస్తే,105 మంది అభ్యర్థులనే టీఎస్‌‌‌‌పీఎస్సీసెలెక్ట్‌‌‌‌ చేసింది. నల్గొండ జిల్లాలో మాత్రం 356 పోస్టులకు.. 341 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అన్ని జిల్లాల సెలెక్టెడ్‌‌‌‌ అభ్యర్థుల వివరాలను బుధవారం వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టగా.. గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌ కొనసాగింది. ఈ నెల 13,14 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహించి, పోస్టింగ్ ఆర్డర్స్‌‌‌‌ ఇవ్వనున్నారు.

జిల్లాల వారిగా భర్తీ చేసే పోస్టుల వివరాలు

జిల్లా                      నోటిఫై                  ఎంపిక             ఖాళీలు

ఆదిలాబాద్               216                    149                   67

హైదరాబాద్‌‌‌‌              197                    109                   88

కరీంనగర్‌‌‌‌                  303                    260                   43

ఖమ్మం                    128                    105                   23

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌        442                    374                   68

మెదక్‌‌‌‌                     278                    210                   68

నల్గొండ                    356                    341                   15

నిజామాబాద్‌‌‌‌             138                    103                   35

రంగారెడ్డి                  280                    251                   29

వరంగల్‌‌‌‌                   171                    156                   15

మొత్తం                 2,509                 2,058                 451