ఏపీలో 206 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం

ఏపీలో 206 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం
  •     విజయవాడలో  ఆవిష్కరించిన సీఎం జగన్ 

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. గ్రౌండ్ నుంచి 206 ఫీట్ల ఎత్తు (కాంక్రీట్ పోడియం 81 ఫీట్లు, విగ్రహం పొడవు 125 ఫీట్లు) ఉన్న ఈ స్టాచ్యూను నగరంలోని స్వరాజ్ మైదాన్ లో ఏర్పాటు చేశారు. మొత్తం18.18 ఎకరాల విస్తీర్ణంలో పార్కుతోపాటు వాటర్ పాండ్స్ ఇతర సౌలతులను సిద్ధం చేశారు. ఈ విగ్రహానికి ‘సామాజిక న్యాయ మహా శిల్పం (స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్)’ అని పేరు పెట్టారు. విగ్రహ నిర్మాణానికి 120 టన్నుల కాంస్యం, 400 టన్నుల ఉక్కును వాడారు. వినియోగించారు. మొత్తం రూ. 404.35 కోట్లు ఖర్చు చేశారు.