కాగజ్ నగర్, వెలుగు: యూరియా కోసం రైతులు ముందుగానే యాప్లో బుక్ చేసుకోవాలని ఆసిఫాబాద్జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటి స్పష్టం చేశారు. సోమవారం కౌటాల రైతు వేదికలో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ గురించి మండలం లోని ఫర్టిలైజర్ డీలర్స్కు అవగాహన కల్పించారు. యూరియా కోసం రైతులు యాప్ లో బుకింగ్ చేసుకున్నాక ఐడీ నంబర్ వస్తుందని, రైతులు వారికి నచ్చిన షాపుల్లో యూరియా బుకింగ్ చేసుకోవచ్చన్నారు.
పట్టాదారుతో పాటు కౌలు రైతులకు కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు. డీలర్లు నిబంధనలు అతిక్రమించి యూరియా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌటాల ఏవో ప్రేమలత, గురుడుపేట సహకార సంఘం సీఈవో రాజు, ఏఈవోలు అంజన్న, ఘన్ శ్యామ్, రాజేశ్వర్, కవిత, రష్మిత పాల్గొన్నారు.
