విశ్వక్ సేన్ ఫంకీ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్

విశ్వక్ సేన్  ఫంకీ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్

 

విశ్వక్‌‌‌‌‌‌‌‌సేన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ రూపొందించిన  చిత్రం ‘ఫంకీ’. కయాదు లోహర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించింది.   సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ  ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండు సాంగ్స్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. సోమవారం మూడో పాటను  రిలీజ్ చేసింది.  భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌‌‌‌‌‌‌‌కు దేవ్ పవార్ క్యాచీ లిరిక్స్ అందించాడు. 

భీమ్స్,  రోహిణి సోరట్ కలిసి పాడారు. ‘నిజమేనా.. నువ్వేనా.. ఏమైనా.. నా కల్లోకి వచ్చి కన్నే కొట్టావా.. కల్లోనే ఉన్నావా.. నీ ఆశలన్నీ అస్సాం అయిపోవా..  నా చిలకమ్మా రావమ్మా.. ఈ జన్మే నీదమ్మా..’ అంటూ సాగిన పాటలో విశ్వక్‌‌‌‌‌‌‌‌సేన్, కయాదు లోహర్ జోడీ ఇంప్రెస్ చేసింది.  ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీలో వీరు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.  ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో విశ్వక్‌‌‌‌‌‌‌‌సేన్ మాట్లాడుతూ ‘ఇదొక క్లీన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ  మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు’ అని చెప్పాడు.