సింగరేణి బొగ్గు గనుల్లో 22 శాతం కార్మికులు రక్తపోటు బాధితులే..

సింగరేణి బొగ్గు గనుల్లో 22 శాతం కార్మికులు రక్తపోటు బాధితులే..

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లో పని చేస్తున్న 22 శాతం మంది కార్మికులు రక్తపోటు బాధితులేనని సింగరేణి మెడికల్ సూపరింటెండెంట్ కె.నాగేశ్వర్​రావు అన్నారు. శనివారం మందమర్రిలోని కేకే డిస్పెన్సరీలో ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో 9 వేల మందికి పైగా ఉద్యోగులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని తెలిపారు. ఇది గుండె, కిడ్నీ, మెదడు, కంటి సమస్యలకు కారణమవుతుందన్నారు.

కూరల్లో ఉప్పు తగ్గించి, ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.  ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జీవీటీసీసీ మేనేజర్ గుండేటి శంకర్, సీఎంవోఏ ప్రెసిడెంట్​రమేశ్, గుర్తింపు సంఘం సెక్రటరీ సత్యనారాయణ, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.