ఎస్బీఐ 22,217 ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఈసీకి పంపింది

ఎస్బీఐ 22,217 ఎలక్టోరల్ బాండ్ల  వివరాలు ఈసీకి పంపింది

ఎన్నిక‌ల బాండ్ల వివ‌రాల‌ను సమర్పించాలని ఇటీవ‌ల ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఎలక్టరోల్ బాండ్లల  వివరాలను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ కు సమర్పించినట్లు ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వ‌ర‌కు సుమారు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్లను జారీ చేసిన‌ట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశార‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. బాండ్ల కేసులో ఇవాళ ఎస్బీఐ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. 

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి డేటాను స‌మ‌ర్పించిన‌ట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది. ఈసీకి పెన్‌డ్రైవ్‌లో ఆ స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు ఎస్బీఐ చెప్పింది. రెండు పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్‌వ‌ర్డ్  ప్రొటెక్షన్ తో ఇచ్చింది. 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ వ‌ర‌కు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్లను జారీ చేసిన‌ట్లు ఎస్బీఐ వెల్లడించింది.