సిక్కింలో ఆకస్మిక వరదలు..23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

సిక్కింలో ఆకస్మిక వరదలు..23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

సిక్కింలోని లాచెన్ వ్యాలీలోని ఆకస్మిక వరదల కారణంగా బుధవారం(అక్టోబర్4)  ఉదయం 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. తీస్తా నదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఆర్మీ వాహనాలు మునిగిపోయినట్లు భద్రతాదళాలు ధృవీకరించాయి. సిబ్బందితోకోస సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తర సిక్కింలో మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి  ఆకస్మిక వరదలు సంభవించడంతో తీస్తా నదిలో వరద ఉధృతి పెరిగింది.

మంగళవారం(అక్టోంబర్ 03) రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు పేలడం వల్ల ఈ వరద ఏర్పడింది. దీని కారణంగా తీస్తాలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.