పండుగ సీజన్ ముందు తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..?

పండుగ సీజన్ ముందు తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..?

దీపావళి పండుగ సీజన్ అయినప్పటికీ రోజురోజుకూ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ సందర్భంగా హైదరాబాద్ గోల్డ్ షాపుల్లో జనాలు కిటకిటలాడుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరోవైపు  వెండి ధర స్పల్పంగా పెరిగింది. 

నవంబర్ 07న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 110కి తగ్గింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

ఇక వెండి విషయానికి వస్తే.. వెండి ధర నవంబర్ 07న స్వల్పంగా పెరిగింది. దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర మంగళవారం రూ. 75,200లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200లకు పెరిగింది. 

హైదరాబాద్..

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 56, 250
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 61, 360

కిలో వెండి ధర: రూ. 78, 200

విజయవాడ..

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 56, 250
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 61, 360

కిలో వెండి ధర: రూ. 78, 200

విశాఖపట్నం..

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 56, 250
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 61, 360

కిలో వెండి ధర: రూ. 78, 200.