ఉస్మానియాలో 24 గంటల హెల్ప్‌‌‌‌ లైన్

ఉస్మానియాలో 24 గంటల హెల్ప్‌‌‌‌ లైన్
  • మూడు షిఫ్టుల్లో నిరంతర సేవలు

బషీర్​బాగ్, వెలుగు: ఉస్మానియా జనరల్ హాస్పిటల్​కు వచ్చే పేద రోగుల కోసం 24 గంటల ప్రత్యేక హెల్ప్‌‌‌‌లైన్, రోగి సహాయక సేవలు షురూ అయ్యాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్ సమక్షంలో బీఎస్బీ హ్యూమన్ డెవలప్​మెంట్ ట్రస్ట్ ప్రతినిధి సల్మాన్ బాబు ఖాన్ మంగళవారం ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సేవలతో రోగులకు తక్షణ సహాయం, మార్గనిర్దేశం అందుతుందన్నారు.‌‌‌‌ మొదటి సంవత్సరంలో 15 ప్రభుత్వ హాస్పిటళ్లలో 80 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సాయంతో సేవలు అందించనున్నట్లు తెలిపారు.

హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో ఉస్మానియాలో 20 మందికి పైగా శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకులు మూడు షిఫ్టుల్లో నిరంతర సేవలు అందిస్తారన్నారు. అత్యవసర కేసుల్లో సుమారు 25 శాతం రాత్రివేళల్లో వస్తున్నందున, 24 గంటల హెల్ప్​ లైన్ అవసరమని సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్ తెలిపారు. డయాలిసిస్ కేంద్రం, శస్త్రచికిత్సలకు కూడా ఈ సేవలు కీలకమన్నారు. ఓపీ బ్లాక్ ర్యాంప్ పక్కన వార్ రూమ్​గా మార్చిన ఖాళీ ప్రదేశంలో హెల్ప్‌‌‌‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశామని, రోగులు 7780288622 నంబర్‌‌‌‌లో సంప్రదించవచ్చన్నారు.