
గ్రేటర్‌వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం మొదలైన వర్షం బుధవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగింది. రోడ్లపై ఎక్కడికక్కడ బురద, వాన నీరు నిలవగా ఇబ్బందులు పడుతూనే ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో సిటీలోని అన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్‌స్తంభాలు నెలకొరిగాయి. దీంతో బుధవారం సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగాయి.
జీడిమెట్లలో 24 గంటల పాటు కరెంట్ సప్లై నిలిచిపోయింది. ఆర్టిజన్ కార్మికుల సమ్మెతో కరెంట్‌వైర్లు తెగిపడినా ఎవరూ పట్టించుకోలేదు. ఉక్కపోత, దోమలతో వేల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. కనీసం ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు చార్జీంగ్పెట్టుకునే అవకాశం లేక కమ్యూనికేషన్నిలిచిపోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తూ ఆర్టిజన్లు సమ్మెలో ఉండడంతోనే లేట్అయిందన్నారు. అలాగే రహమత్ నగర్లో గోడ కూలి ఎనిమిదేండ్ల చిన్నారి మృతి చెందింది.
నారాయణఖేడ్‌కు చెందిన శ్రీకాంత్, జయదేవి భార్యాభర్తలు. ఉపాధి కోసం సిటీకొచ్చి రహమత్ నగర్ ఎస్పీఆర్‌హిల్స్‌లోని రేకుల ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పక్క బిల్డింగ్గోడ కూలి వీరి రేకులపై పడింది. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీకాంత్కూతురు జీవనిక(8)పై రేకులు పడడంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటయ్యకు చెందిన ఆవు, లేగదూడపై పిడుగు పడి మృతిచెందాయి. బుధవారం ఉదయం పాలు తీసేందుకు పాక వద్దకు వెళ్లిన వెంకటయ్య వాటిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ లో వర్షానికి దెబ్బతిన్న పంటలను బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టాన్ని తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రావు, ఎంపీటీసీ శోభారెడ్డి ఉన్నారు.