హైదరాబాద్‌సిటీ, వెలుగు: గోషామహల్ సర్కిల్‌లోని అళ్లబండ రిజర్వాయర్ వద్ద 10 ఎంఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్ వాల్వ్‌ల వద్ద భారీ లీకేజీలు ఏర్పడిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త వాల్వ్‌లను అమర్చే పనులు చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి.
ఈ కారణంగా.. జిర్రా, ఇందిరానగర్, హరి దర్గా, కుమ్మరవాడి, టప్పాచబుత్రా, ఆకాశ్‌పురి, షిబ్లీ హిల్స్, బిలాల్ మసీదు పరిసరాలు, గోడేకి కబర్, జాలి, హనుమాన్, జంగూర్ బస్తీ, అబూషటాకియా, 2జే బస్టాప్, జియాగూడ, కార్వాన్, సబ్జిమండి, గంగానగర్, ఉస్మానియా, శివలాల్ నగర్, బెర్హాంగల్లీ, గంగామాత, జాలి హనుమాన్, ఆజంగల్లీ, రహీంపురా, పురానాపూల్, చుడీ బజార్, ఉస్మానియా దవాఖాన పరిసరాలు, శంకర్ బజార్, జుమ్మెరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు.
