ఉమ్మడి నిజామాబాద్ సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ సంక్షిప్త వార్తలు

ధర్పల్లి, వెలుగు: ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లు నిరుపేదలైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఎంతో ఆదుకుంటున్నాయని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. ధర్పల్లి మండలకేంద్రంలో శుక్రవా రం కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీ చేసి మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే నిరుపేదలకు పథకాలు అందుతున్నాయన్నారు. ఇది చూసి కొందరు ఓర్వలేక తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతార్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబరీ మోహన్, జడ్పీటీసీ జగన్​, ఎంపీపీ సారికా హన్మంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,423 పెన్షన్లు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా మంజూరై 2,423 పెన్షన్ల ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 11,917 మందికి పెన్షన్లను అందుతున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్ను, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

భిక్కనూరు మండలంలో..  
భిక్కనూరు, వెలుగు: మండలంలోని మోటాట్పల్లి, తిప్పాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ర్యాగట్లపల్లి, గుర్జకుంట, సిద్దరామేశ్వర నగర్, జంగంపల్లి గ్రామాలకు మంజూరై 1,551 పింఛన్లను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు.

అందరి చూపు తెలంగాణ వైపే
లింగంపేట,/ ఎల్లారెడ్డి వెలుగు: సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలోని అన్ని రాష్ట్రాలు నేడు తెలంగాణ వైపే చూస్తున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చెప్పారు. శుక్రవారం లింగంపేట శివారులోని జీఎన్ఆర్ గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 88 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు దండుగ అన్న వ్యవసాయం టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో పండుగలా మారిందన్నారు. సీఎం కేసీఆర్ మిషన్​కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించారన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్​ పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే దక్కుతుందన్నారు. కులం, మతం, దేవుళ్ల పేరుతో  బీజేపీ లీడర్లు గ్రామాల్లో చిచ్చుపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వారి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్​బొల్లు లావణ్య, ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ శ్రీలత, మార్కెట్​కమిటీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరహరి, ఎంపీటీసీ షమ్మీమున్నీసా, తహసీల్దార్ మారుతి, డిప్యూటీ తహసీల్దార్​రాజేశ్వర్, ఆర్ఐ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 5న నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే సీఎం సభకు నియోజకవర్గంలో నుంచి 20 వేల మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు సూచించారు.

పలువురు ఎస్సైల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పలువురు ఎస్సైలను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగరాజు శుక్రవారం ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. ఆర్మూరు ఎస్సైగా పనిచేస్తున్న శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నందిపేటకు, త్రీ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సై భాస్కరాచారి సిరికొండకు, వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న దేవికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సైగా బదిలీ అయ్యారు. అలాగే వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి, జి.నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రీ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సైగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ, మురళిని వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపుతూ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు ఇచ్చారు.

స్కూళ్లలో సమస్యలు పరిష్కరించాలి
భీంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్కూళ్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ స్టేట్ లీడర్ ఏలేటి మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్భా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న బాలికలకు ఇస్తున్న మీల్స్ మెనూ, హాస్టల్ ఫెసిలిటీస్‌‌ను అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళలో ఎలుకలు, తేళ్లతో ఇబ్బందులు పడుతున్నట్లు స్టూడెంట్లు ఆయనకు వివరించారు. గదులకు కిటికీలు, తలుపులు సరి చేయించాలని, దగ్గరలో డంపింగ్ యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖాళీ చేయించాలని ఆఫీసర్లను కోరనున్నట్లు మల్లికార్జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు ఉన్నారు.