గోదావరి  ముంపు ప్రాంతాల్లో  మూడు షిఫ్టులు 

గోదావరి  ముంపు ప్రాంతాల్లో  మూడు షిఫ్టులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం నుంచి ఆఫీసర్లు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే సంబంధిత శాఖలకు చేరవేసి సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.

రహదారులు దెబ్బతినడం, నీరు నిల్వ ఉండడం, వాగులు పొంగి ప్రవహించడం వంటి సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 08744-241950 నంబర్‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందించాలని, శాఖల మధ్య సమన్వయంతో వరద పరిస్థితులను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.