25% మందికి దోస్తులు లేరు

25% మందికి దోస్తులు లేరు

దోస్తులు లేకుండా జీవితాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు మిలీనియల్స్.  ఏకాకులమని వారంతా దిగులుతో, డిప్రెషన్​లోకి వెళ్లిపోతున్నారు. దీంతో ఫుల్లుగా మందు కొట్టడం, డ్రగ్స్​ తీసుకోవడం, చివరకు ఆత్మహత్యల దాకా వెళ్లిపోతున్నారు. అయితే, అంతకుముందు తరాలకు చెందిన బేబీ బూమర్స్, జనరేషన్–ఎక్స్​ వారికి మాత్రం జీవితంలో చాలా మంది స్నేహితులు ఉన్నారట. వారికి ఒంటరితనం సమస్య చాలా తక్కువగా ఉందట.  బ్రిటన్​కు చెందిన ‘యూగవ్’ అనే రీసెర్చ్​కంపెనీ చేసిన సర్వేలో ఈ సంగతులు వెల్లడయ్యాయి. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి టీనేజ్​ నుంచి యుక్త వయసులోకి వచ్చిన వారిని మిలీనియల్స్ అంటారు. అంటే.. 1980-–90 మధ్య పుట్టినవారు.  1946–1964 మధ్య పుట్టినోళ్లను  బేబీ బూమర్స్​ అని, 1960–1980 మధ్య పుట్టిన వారిని జనరేషన్​ఎక్స్​ అని అంటారు.

సర్వేలో ఏం తేలిందంటే…

25% మిలీనియల్స్​కు ఒక్క ఫ్రెండ్​కూడా లేరు.

జనరేషన్ ​ఎక్స్​ వారిలో 16%, బేబీ బూమర్స్​లో

9 % మందికి దోస్త్​లు లేరు.

బూమర్స్​కు సగటున 50 మంది దోస్త్​లున్నారు.

మిలీనియల్స్​లో 50 మందికి పైగా ఫ్రెండ్స్​ఉన్నవారు 6% మందే

మిలీనియల్స్​లో 25% మంది ఒంటరితనంతో డిప్రెషన్ ​బారిన పడుతున్నారు.

జనరేషన్​ ఎక్స్​లో 20%, బేబీ బూమర్స్​లో 15% మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు.

30% మంది మిలీనియల్స్​ తాము ఎవరినీ బెస్ట్​ఫ్రెండ్​గా పరిగణించమని చెప్పారు.

జనరేషన్​ఎక్స్​ వారిలో 27%, బేబీ బూమర్స్​లో 25% మంది బెస్ట్​ ఫ్రెండ్స్​ ఎవరూ లేరన్నారు.