Good News : 60 ఏళ్లు దాటిన వారికి.. ఆర్టీసీలో 25 శాతం రాయితీ

Good News : 60 ఏళ్లు దాటిన వారికి.. ఆర్టీసీలో 25 శాతం రాయితీ

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. మీకు 60 ఏళ్లు దాటాయా.. అయితే మీకు ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన వారికి.. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలో 25 శాతం రాయితీ ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 2023, సెప్టెంబర్ 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లు అందరికీ ఈ 25 శాతం రాయితీ వర్తిస్తుందని ప్రకటించింది ఆర్టీసీ. 

సీనియర్ సిటిజన్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో.. 25 శాతం పొందాలంటే అర్హత కార్డులు చూపించాలని ప్రకటించారు అధికారులు. ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డులలో ఏదో ఒక ఐడీ కచ్చితంగా చూపించాలనే నిబంధనల పెట్టారు. ఆయా ఐడీ కార్డులను డిజిటల్ ఆధార్ కార్డును.. ఐడీ ప్రూఫ్ గా పరిగణిస్తామని కూడా స్పష్టం చేశారు అధికారులు. ఈ రాయితీ కౌంటర్లలో అడ్వాన్స్ బుకింగ్ కూడా వర్తిస్తుందని.. ఈ సదుపాయాన్ని సీరియర్ సిటిజన్లు ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు అధికారులు.