తల్లి చనిపోయిందని సొంతూరెళ్తే.. 25 తులాల బంగారం చోరీ

తల్లి చనిపోయిందని సొంతూరెళ్తే.. 25 తులాల బంగారం చోరీ

హైదరాబద్ సిటీ, వెలుగు: బోయిన్ పల్లి పోలీస్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో 25 తులాల బంగారం, వెండి, డబ్బు చోరీ జరిగింది. బోయిన్ పల్లి పరిధిలో ఉండే అంజిరెడ్డి తన తల్లి చనిపోయిందని అంతిమ సంస్కారాల కోసం కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాలోని సొంతూరుకు వెళ్ళాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని పక్కింటి వారు ఫోన్ చేయగా వచ్చి చూశాడు. లోపలకు వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాలోని 25 తులాల బంగారం, వెండి, డబ్బు కనిపించలేదు. దీంతో బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాల్లో దొంగలు వచ్చిన వీడియోలను పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.