గుజరాత్ పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్  పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్ ఖేడా టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో 25కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఇందులో బైకులు, ఆటో రిక్షాలు, కార్లున్నాయి. ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి వాహనాలన్నీ కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కావాలనే వాహనాలకు నిప్పు పెట్టారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.