న్యూఢిల్లీ: తమ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు ప్రకటనలు, డార్క్ ప్యాటర్న్స్ లేవని జెప్టో, బిగ్‌బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, జియో మార్ట్ సహా 26 ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయి. వినియోగదారులను తప్పుదారి పట్టించే లేదా బలవంతపెట్టే డిజైన్ పద్ధతులను నిరోధించేందుకు ప్రభుత్వం 2023లో మార్గదర్శకాలు జారీ చేసింది.
మొదట్లో ప్రొడక్ట్ రేటు తక్కువగా చూపించి, బిల్లింగ్ దగ్గర ఇతర ఫీజులు కలపడం, తక్కువ రేటున్న ప్రొడక్ట్ అందుబాటులో లేదని సిమిలర్‌గా ఉండే ఎక్కువ రేటున్న ప్రొడక్ట్‌ను కొనేలా చేయడం, స్టాక్ అయిపోతోందని గాబరా పెట్టడం, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్ వంటి మోసపూరిత పద్ధతులు డార్క్ ప్యాటర్న్స్ కిందకు వస్తాయి.
ఈ–కామర్స్ కంపెనీలు అంతర్గత లేదా థర్డ్ పార్టీ ఆడిట్లు నిర్వహించి, వాటిని తొలగించినట్లు ప్రకటించాయి. ఇతర సంస్థలు కూడా ఇదే విధంగా సొంతంగా నియంత్రణలు పాటించాలని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సూచించింది. వినియోగదారులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా డార్క్ ప్యాటర్న్స్‌ను గుర్తించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
