భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో బుధవారం అక్కడి ఎస్పీ కిరణ్చౌహాన్ సమక్షంలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిపై రూ.64లక్షల రివార్డు ఉంది. జిల్లాలోని మార్వార్ డివిజన్ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) కమిటీ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు.
వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థికసాయం, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా తోడ్పాటు అందిస్తామని చెప్పారు.
