గచ్చిబౌలిలో111 ఇండ్లకు 2,663 అప్లికేషన్లు..ముగిసిన గడువు.. జనవరి 6న లాటరీ

గచ్చిబౌలిలో111 ఇండ్లకు 2,663 అప్లికేషన్లు..ముగిసిన గడువు.. జనవరి 6న లాటరీ

హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి, వరంగల్ లోని హౌసింగ్ బోర్డు ఇండ్లకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ సమీపంలోని మూడు బ్లాక్ ల్లో ఉన్న 111 ఫ్లాట్లకు ఇప్పటి వరకు 2,663 అప్లికేషన్లు వచ్చాయి. శనివారంతో అప్లికేషన్ల గడవు ముగిసింది. ఈ నెల 6న గచ్చిబౌలి ఫ్లాట్లకు, ఈ నెల 8న వరంగల్ ఫ్లాట్లకు అధికారులు లాటరీ తీయనున్నారు. 

వరంగల్ లో 102  ఫ్లాట్లకు 385 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలో 479 ఎస్ఎఫ్ టీ నుంచి 636 ఎస్ఎఫ్ టీ వరకు ఉన్న ఫ్లాట్ల ధరలు రూ. 29 లక్షల నుంచి రూ. 36 లక్షల వరకు ఉన్నాయి. ఈ వేలంలో పాల్గొనేందుకు ఈఎండీ డిపాజిట్ గా రూ.1 లక్ష చెల్లించాలని అధికారులు నిర్ణయించారు.