టెట్ పరీక్ష కోసం 2683 సెంటర్లు

టెట్ పరీక్ష కోసం 2683 సెంటర్లు

హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లో సౌలత్​లను బట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కువగా హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఏర్పాటు చేయగా, అతి తక్కువగా ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో రెడీ చేశారు. మరోపక్క టెట్ పరీక్ష అబ్జర్వర్లుగా విద్యాశాఖ సీనియర్ అధికారులను నియమించారు. ఈ నెల12న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జరిగే టెట్ పేపర్–1 కు 1,480 సెంటర్లు కేటాయించగా.. వాటిలో 3,51,468 మంది పరీక్ష రాయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 1,203 సెంటర్లలో 2,77,884 మంది అటెండ్ కానున్నారు. అత్యధికంగా హైదరాబాద్​లో పేపర్–1కు 117 సెంటర్లలో 27,978 మంది, పేపర్–2కు 95 సెంటర్లలో 22,622 మంది హాజరుకానున్నారు. నల్గొండలో పేపర్–1కు 96 సెంటర్లలో 22,936 మంది, పేపర్–2కు 87 సెంటర్లలో 20,543 మంది అటెండ్ కానున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ(రంగారెడ్డి పేపర్1 మినహా) 20వేల లోపే అభ్యర్థులు హాజరవుతున్నారు. ములుగులో పేపర్–1కు 1,806 మంది, పేపర్​–2కు 1,256 మంది, భూపాలపల్లిలో పేపర్–1కు 1,974 మంది, పేపర్–2కు 1,620 మంది అటెండ్ కానున్నారు. అయితే డీవోలు మినహా ఇతర సిబ్బంది, ఇన్విజిలేటర్లను విద్యాశాఖతో సంబంధం లేనివాళ్లను నియమించారు. పేపర్‌‌-2 సాయంత్రం  ఉంటుందని టెట్ కన్వినర్ రాధారెడ్డి తెలిపారు.