గ్రూప్ 1కు 2.7 లక్షల అప్లికేషన్లు

గ్రూప్ 1కు 2.7 లక్షల అప్లికేషన్లు
  •  నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ఎగ్జామ్ దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనున్నది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 2.7 లక్షల మంది అప్లై చేసుకున్నారని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. గత నెల19న 563 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే 2022లో దరఖాస్తు చేసుకున్న వారూ తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని టీఎస్​పీఎస్సీ సూచించింది. 

నిరుడు ఈ ఎగ్జామ్ కు 3,80,204 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి 2.7 లక్షల మంది అప్లికేషన్ చేసుకోగా.. గురువారం చివరిరోజున మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశముంది. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు దరఖాస్తుల సవరణకు చాన్స్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 9న ఉంటుందని టీఎస్​పీఎస్సీ ఇదివరకే ప్రకటించింది.