డేటింగ్ లవ్ : 28 ఏళ్ల అమ్మాయి.. 70 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

డేటింగ్ లవ్ : 28 ఏళ్ల అమ్మాయి.. 70 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

మన సమాజంలో ప్రస్తుతం ప్రేమకు అవదులు...పరిమితులను కొందరు ప్రేమికులు చేరిపేస్తున్నారు. ప్రేమ గుడ్డిది అంటుంటారు... ఎందుకంటే ఒక్కసారి ప్రేమలో పడిన వారు రంగు, కులం, దేశం, ప్రాంతీయ బేదాలను సైతం పట్టించుకోరు. తాము వలిచిన వారితో జీవించేందుకు ఇంట్లో వాళ్లనైనా, సమాజాన్నైనా ఎదురిస్తారు. ఎన్ని హద్దులున్నా దాటుకుని వచ్చి.. ఒక్కటవుతారు. ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 

28  ఏళ్ల అమ్మాయి జాకీ .. 70 ఏళ్ల డేవ్  ఇద్దరూ ప్రేమించుకున్నారు.  వీరు చూడటానికి తాతా మనవరాలి మాదిరిగా ఉంటారు. వీరి వయస్సు  42 ఏళ్ల ( వార్త రాసే రోజుకు)  తేడా ఉంది ఏడేళ్ల నుంచి వీరిద్దరూ భార్యభర్తలుగా జీవిస్తున్నారు.   డేవ్ ఏడు సంవత్సరాల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లినప్పుడు  డేటింగ్ యాప్ లో జాకీని పరిచయం చేసుకున్నాడు.  ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.  అప్పుడు జాకీ వయస్సు 21 సంవత్సరాలు కాగా.. డేవ్ వయస్సు 63 సంవత్సరాలు.  అప్పటికే అతను సీనియర్ సిటిజన్ అయ్యాడు.    వయస్సులో ఇంత తేడా ఉన్నా.. ఆయనతో ప్రేమలో పడింది.  ఆయనతోనే జీవిస్తుంది. జాకీ తన ప్రియుడు డేవ్ తో కలిసి జీవించేందుకు అమెరికా వచ్చింది.   అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.   ప్రస్తుతం  వీరు కలిసి జీవిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.   చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారని వారు తెలిపారు.  డేవ్ ను డబ్బుకోసం ప్రేమించలేదని జాకీ తెలిపింది.  నెటిజన్లు చేసే ట్రోల్స్ కు వారు సమాధానం ఇస్తున్నారు.  వయస్సులో చాలా తేడా ఉన్నా... అది తాము పట్టింపు కాదని... చాలా సంతోషంగా జీవిస్తున్నామని తెలిపారు.