భర్త విడాకుల నోటీసు పంపాడని.. రెండేండ్ల బిడ్డతో కలిసి తల్లి తొందరపాటు నిర్ణయం

భర్త విడాకుల నోటీసు పంపాడని.. రెండేండ్ల బిడ్డతో కలిసి తల్లి తొందరపాటు నిర్ణయం
  • ట్యాంక్​బండ్లో దూకగా.. ఇద్దరి డెడ్​బాడీలు లభ్యం
  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన

ట్యాంక్ బండ్, వెలుగు: దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఇవన్నీ వద్దని ఆమె రెండేండ్ల బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.. చార్టెట్​అకౌంటెంట్​గా పని చేస్తూ ఏడాదిన్నరగా పాపను చూసుకుంటోంది.. భర్తతో గొడవలున్నా ధైర్యంగా తన ఉద్యోగ, తల్లి బాధ్యతలు మోస్తున్న ఆమెకు భర్త పంపిన విడాకుల నోటీసు తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఇక బతకొద్దనుకొని, పాపతో కలిసి ట్యాంక్​బండ్​లో దూకి సూసైడ్​చేసుకుంది. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బహదూర్​పుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సిటీకి చెందిన పృథ్వీలాల్–కీర్తిక అగర్వాల్(28) దంపతులు. వీరికి రెండేండ్ల పాప బియ్యారా ఉంది. పృథ్వీలాల్ బిజినెస్, కీర్తిక అగర్వాల్ చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తున్నారు. అయితే, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కీర్తిక అగర్వాల్​తన బిడ్డను తీసుకొని బహదూర్ పుర మంగళ్ హాట్ లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఏడాదిన్నరగా అక్కడే ఉంటూ చార్టెడ్ అకౌంటెంట్​గా వర్క్ ఫర్ హోం చేస్తూ పాపను చూసుకుంటోంది.

ఈ క్రమంలో పృథ్వీలాల్ నుంచి ఆమెకు విడాకుల నోటీసు రావడంతో మనస్తాపానికి గురైంది. ఆదివారం మధ్యాహ్నం పాపతో కలిసి ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. కీర్తిక అగర్వాల్​తండ్రి వినోద్ గోయల్ సోమవారం బహుదూర్ పుర పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ పరిశీలించారు. అందులో కీర్తిక తన కూతురితో కలిసి ట్యాంక్ బండ్ లో దూకినట్లు కనిపించింది. లేక్ పోలీసులు సోమవారమే కీర్తిక అగర్వాల్ డెడ్ బాడీని గుర్తించి, గాంధీ హాస్పిటల్​మార్చురీకి తరలించారు.

ఆమె పాప బియ్యారా మృతదేహం మంగళవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో నీటిపై తేలియాడుతూ కనిపించింది. స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆ చిన్నారి డెడ్​బాడీని  సైతం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. అనంతరం తల్లీబిడ్డల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.