మూడేండ్లలో కొన్న బస్సులు 280 .. స్క్రాప్​ చేసింది 3,600

మూడేండ్లలో కొన్న బస్సులు 280 .. స్క్రాప్​ చేసింది 3,600
  • ఆర్టీఐ ద్వారా వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీలో కొత్త బస్సులను కొంటలేరు. గత మూడేండ్లలో బస్సులను పరిమిత సంఖ్యలోనే కొనుగోలు చేసినట్లు ఓ ఆర్టీఐ దరఖాస్తుకు అధికారులు ఇచ్చిన వివరాల ద్వారా వెల్లడైంది. 2018–19  నుంచి 2021 జనవరి వరకు 280 బస్సులనే కొన్న ఆర్టీసీ.. 3,600 బస్సులను పాత ఇనుప సామాను కింద స్క్రాప్ చేసినట్లు తేలింది. ప్రస్తుతం ఆర్టీసీలో 9 వేల బస్సులు ఉండగా, ఇందులో 3,200 అద్దె బస్సులే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు కొనుగోలు చేసిన బస్సులు1,825 మాత్రమే. ఆయా ప్రాంతాలకు బస్సులు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సీడీపీ నిధులతో బస్సులను కొనుగోలు చేసేలా సహకరించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక్కో మెంబర్‌‌ రూ.50 లక్షల చొప్పున మంజూరు చేసినా 300 బస్సుల వరకు కొనొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.