నవోదయ స్కూల్లో కరోనా కలకలం

నవోదయ స్కూల్లో కరోనా కలకలం

కోల్కతా : కరోనా వైరస్ మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బెంగాల్ లో ఒకే స్కూల్లో 29 మంది విద్యార్థులకు కరోనా సోకింది. బాధితులంతా కళ్యాణ్ లోని జవహర్ నవోదయ విద్యాలయలో 9,10వ చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థులు జ్వరంగా ఉందని చెప్పడంతో స్కూల్ సిబ్బంది వారికి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించారు. వారికి పాజిటివ్ గా తేలడంతో మిగిలిన 215 మంది స్టూడెంట్స్ తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికికరోనా పరీక్షలు చేశారు. దీంతో మరో 27 విద్యార్థులకు కరోనా ఉన్నట్లు తేలింది. 29 మంది స్టూడెంట్స్ దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో వారికి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పిల్లలందరినీ హోం క్వారంటైన్ లోఉండాల్సిందిగా సూచించారు.

మరిన్ని వార్తల కోసం

తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు !

తెలంగాణ గ్రామంలో 10 రోజుల లాక్ డౌన్

కరోనా కట్టడిపై ప్రధాని మోడీ సమీక్ష