వారెవ్వా వార్న్..బాల్ ఆఫ్ ది సెంచరీకి 29ఏళ్లు

వారెవ్వా వార్న్..బాల్ ఆఫ్ ది సెంచరీకి 29ఏళ్లు

లెగ్ స్పిన్ ను కొత్త పుంతలు తొక్కించిన షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో మేటీ బ్యాట్స్మెన్లను సైతం హడలెత్తించారు. ప్రధానంగా లెగ్ స్టంప్ అవతల బాల్ వేసి హాప్ స్టంప్ ను ఎగరగొట్టడంలో దిట్ట. షేర్న్ వేసే బాల్ ఎటువైపు పడి ఎటువైపు వెళ్తుందో తెలియక బ్యాటర్లు వికెట్ సమర్పించుకున్న ఘటనలు ఎన్నో. అతను వేసిన ఓ డెలివరీ బాల్ ఆఫ్ ది సెంచరీగా చరిత్రలో నిలిచిపోయింది. అతను వేసిన ఆ బాల్ కు ఇవాళ్టికి 29ఏళ్లు పూర్తయ్యాయి. ఐసీసీ ఆ లెజెండ్ ను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసింది.

1993 జూన్ 4న  మాంచెస్టర్ లో ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ లో షేన్ వార్స్ వేసిన ఓ బాల్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్ లో  తొలి ఇన్నింగ్స్ లో ఆసీసీ 289 రన్స్కే ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది.  అప్పుడే స్పిన్ ను దీటుగా ఎదర్కోగల మైక్ గాటింగ్ బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పటికే వార్న్ ఎంట్రీ ఇచ్చి ఏడాది మాత్రమే కాగా 11టెస్టులే ఆడాడు. అయినా కూడా ఆసిస్ కెప్టెన్ వార్న్ బాల్ ఇచ్చాడు. దీంతో బాల్ అందుకున్న వార్న్ తన మణికట్టు మాయాజాలన్ని ప్రదర్శించాడు.

షేన్ వార్న్ వేసిన మొదటి బంతే లెగ్ స్టంప్ అవతల పడి గాటింగ్ బ్యాట్, ప్యాడ్స్ ను తప్పించుకుంటూ హాఫ్ స్టంప్స్ ను ఎగరగొట్టాయి. కొన్ని క్షణాల పాటు గాటింగ్ కు బాల్ ఎలా వెళ్లిందో కూడా అర్ధం కాని పరిస్థితి. అటు ఫీల్డ్ అంపైర్ కూడా ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయాడు. ఆ ఒక్క బండి షేన్ వార్న్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. షేన్ వేసిన ఆ బాల్ ను బాల్ ఆఫ్ సెంచరీగా ఐసీసీ ప్రకటించింది. ఇక అప్పుడు మొదలైన ఈ మాంత్రికుడి ప్రస్థానం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ గా వార్న్ నిలిచారు.

మరిన్ని వార్తల కోసం

చెట్టు మీద పండ్లను ఇలా కోయచ్చా..! ఫిదా అయిన మహీంద్రా

కేసీఆర్ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు