
- నేడు విండీస్‌తో రెండో టీ 20
- సిరీస్‌పై రోహిత్‌సేన గురి
- రా. 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
కోల్‌కతా: ఇండియా టూర్‌కు వచ్చిన వెస్టిండీస్‌తో ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సూపర్ పెర్ఫామెన్స్ చేసిన రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే రెండో టీ20లో కూడా గెలిచి ఈ సిరీస్ కూడా కైవసం చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అదే టైమ్‌లో కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌లో ఫెయిలవుతున్న విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆశిస్తోంది. ఇంకోవైపు వన్డేల్లో 0–3తో వైట్‌వాష్ అయిన కీరన్ పొలార్డ్ కెప్టెన్సీలోని విండీస్ షార్ట్ ఫార్మాట్‌లో ఇండియాకు సవాల్ ఇస్తుందనుకుంటే తొలి టీ20లో తేలిపోయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడితే వరుసగా రెండో సిరీస్ కోల్పోతారు కాబట్టి ఒత్తిడంతా కరీబియన్లపైనే ఉండనుంది. అదే టైమ్‌లో ఇందులో గెలిస్తే టీమిండియా ఫుల్ టైమ్ కెప్టెన్‌గా అపాయింట్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఖాతాలో వరుసగా మూడో సిరీస్ విక్టరీ చేరనుంది.
కోహ్లీ ఫామ్ పైనే టెన్షన్
రోహిత్ కెప్టెన్సీలోని ఇండియా అన్ని డిపార్ట్‌మెంట్లలో బాగా ఆడుతున్నప్పటికీ ఒక్క విరాట్ కోహ్లీ విషయంలోనే ఆందోళన ఉన్నది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండు ఫిఫ్టీలతో రాణించిన కోహ్లీ.. విండీస్‌పై నాలుగు మ్యాచ్‌ల్లో 8, 18, 0, 17 స్కోర్లతో నిరాశ పరిచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విరాట్ తొందర్లోనే ఫామ్‌లోకి వస్తాడని, అతని ఫెయిల్యూర్‌ను పెద్దది చేసి చూడొద్దంటూ కెప్టెన్ రోహిత్..ఫస్ట్ టీ20కి ముందు విమర్శకులతో పాటు మీడియాను కోరాడు. కానీ, తొలి పోరులో మంచి స్టార్ట్‌ను కోహ్లీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అయినా తను హిట్ అవుతాడేమో చూడాలి. మరో ఎండ్‌లో రోహిత్ మాత్రం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పవర్‌ప్లేను పక్కాగా యూజ్ చేసుకొని తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమ్ విక్టరీని ఈజీ చేశాడు. తను అదే జోరు కొనసాగిస్తే ఇండియాకు తిరుగుండదు. అయితే, అతని ఓపెనింగ్ పార్ట్‌నర్ ఇషాన్ కిషన్ మంచి స్కోరే చేసినా వేగంగా ఆడలేకపోయాడు. తన స్టయిల్‌కు డిఫరెంట్‌గా డిఫెన్సివ్ అప్రోచ్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో తనను కొనసాగిస్తారా? లేక ఫామ్‌లో ఉన్న మరో యంగ్‌స్టర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చాన్స్ ఇస్తారా? అన్నది చూడాలి. అదే టైమ్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడుతూ కొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతున్న కీపర్ రిషబ్ పంత్‌కు రెస్ట్ ఇచ్చినా కూడా రుతురాజ్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ మంచి టచ్‌లో ఉండగా.. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఇచ్చిన చాన్స్‌ను వెంకటేశ్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో యూజ్ చేసుకున్నాడు. సూర్యతో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కాబట్టి స్పెషలిస్ట్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్‌లోనూ చాన్స్ రాకపోవచ్చు. ఫస్ట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ పేసర్ దీపక్ చహర్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్ టీమ్‌లోకి వచ్చే చాన్సుంది. ఇక లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన డెబ్యూ టీ20లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో సూపర్ పెర్ఫామెన్స్ చేశాడు. తను ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే బిష్ణోయ్ కెరీర్‌కు మంచి పునాది పడుతుంది.