ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీంతో 3.65 కోట్ల జాబ్స్

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీంతో 3.65 కోట్ల జాబ్స్

సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) స్కీంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల ద్వారా 3.65 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఇప్పటికే 1.65 కోట్ల మంది ఈ స్కీం ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. మంగళవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) నిర్వహించిన “హౌసింగ్ అండ్ కన్ స్ట్రక్షన్, ఏవియేషన్ సెక్టార్ లో స్టీల్ వాడకాన్ని ప్రోత్సహించటం ష‌ అనే అంశంపై వెబ్ నార్ లో మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పీఎంఏవై లో 1.07 కోట్ల ఇళ్ల‌ను సాంక్షన్ చేశామని దీని ద్వారా లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ వాడకంతో పాటు కోట్లాది మందికి జాబ్స్ వస్తాయని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతున్నప్రాజెక్ట్ ల ద్వారా స్టీల్ కు మంచి గిరాకీ ఉందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..