కుత్బుల్లాపూర్ లో హాష్ ఆయిల్ సీజ్.. ముగ్గురు అరెస్ట్

కుత్బుల్లాపూర్ లో హాష్ ఆయిల్ సీజ్.. ముగ్గురు అరెస్ట్

కుత్బుల్లాపూర్ లో హాష్ ఆయిల్ ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు పోలీసులు. మే 25వ తేదీ శనివారం  సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సాయి బాబా నగర్ లో అనుమానాస్పదంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం( స్కూటీ)నీ అడ్డుకుని తనిఖీ చేశారు పోలీసులు. దీంతో కిలో 760గ్రాముల హాష్ ఆయిల్ ను గుర్తించి స్వాధీన చేసుకున్నారు. 

 హాష్ ఆయిల్ ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత హాష్ ఆయిల్ విలువ మార్కెట్ లో సూమారు రూ.8లక్షల 40వేలు వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.